Nellore: వైభవంగా కొనసాగుతున్న మూడో రోజు వినాయక నిమజ్జనాలు
Nellore: నెల్లూరు నగరంలో ఘనంగా కొనసాగుతున్న వినాయక నిమజ్జన కార్యక్రమాలు - గణేష్ ఘాట్‌కు తరలివచ్చిన గణనాథులు, భక్తుల సందడి
Nellore: వైభవంగా కొనసాగుతున్న మూడో రోజు వినాయక నిమజ్జనాలు
నెల్లూరు: వినాయక చవితి వేడుకల్లో భాగంగా నెల్లూరు నగరంలో కొలువుదీరిన గణనాథుల విగ్రహాల నిమజ్జన కార్యక్రమం వైభవంగా కొనసాగుతోంది. ఉత్సవాల్లో భాగంగా మూడోరోజు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాలను గణేష్ ఘాట్‌కు తరలించి సామూహికంగా నిమజ్జనం చేశారు.
విగ్రహ నిర్వాహకులు, భక్తులు ప్రత్యేక వాహనాల్లో గణనాథులను గణేష్ ఘాట్‌కు తీసుకువచ్చారు. భక్తుల సందడితో ఘాట్ పరిసరాలు కిటకిటలాడాయి. నిమజ్జనానికి భారీగా విగ్రహాలు తరలివస్తున్న నేపథ్యంలో అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టారు. పెద్ద సంఖ్యలో విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడంతో కార్యక్రమం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతోంది.
విగ్రహ నిర్వాహకులు, భక్తులు క్రమపద్ధతిలో నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. గణనాథుని నిమజ్జనాన్ని పురస్కరించుకుని ఘాట్ వద్ద భక్తి వాతావరణం నెలకొంది.




