Nellore: శుభాకాంక్షలు తెలిపిన పలువురు టీడీపీ, జనసేన నాయకులు!
Nellore: మాజీ మంత్రి తాళ్లపాక రమేష్ రెడ్డి సతీమణి, సీనియర్ టీడీపీ నాయకురాలు తాళ్లపాక అనురాధ జన్మదిన వేడుకలు నెల్లూరులో ఘనంగా జరిగాయి. పలువురు టీడీపీ, జనసేన నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
Nellore: శుభాకాంక్షలు తెలిపిన పలువురు టీడీపీ, జనసేన నాయకులు!
నెల్లూరు: మాజీ మంత్రి తాళ్లపాక రమేష్ రెడ్డి సతీమణి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకురాలు తాళ్లపాక అనురాధ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆమె నివాసం నాయకులు, కార్యకర్తలు, అభిమానుల రాకతో సందడిగా మారింది. పలువురు రాజకీయ ప్రముఖులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమె నివాసానికి చేరుకుని పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా 21వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి గునుకుల, జనసేన పార్టీ నాయకులు కిషోర్ గునుకుల మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో తమకు అండగా నిలిచి, విజయ ప్రస్థానంలో తోడుగా నడిచిన తాళ్లపాక అనురాధ సహకారం, ఆత్మీయత ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు.
ఆమెకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.




