Nellore: కూటమి పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది: ఎమ్మెల్సీ బీద!

Nellore: కూటమి సుపరిపాలనపై ప్రజలు ఉంచిన అచంచల విశ్వాసానికి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే నిదర్శనమని నెల్లూరులో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర స్పష్టం చేశారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 6 Nov 2026 4:17 PM IST
Nellore
X

Nellore: కూటమి పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది: ఎమ్మెల్సీ బీద!

నెల్లూరు: నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో శాసనమండలి సభ్యులు, జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, పిల్ రావు, మనుబోలు శ్రీధర్ రెడ్డి, మాతంగి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బీద మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నుండి ఎలాగైనా తప్పించుకోవాలని జగన్ స్థాయి నుండి వైసీపీ కార్యకర్త స్థాయి వరకు కోరుకున్నారని, మోసపూరితంగా రిజర్వేషన్ వివాదం ను వైసీపీ నేతలు సృష్టించారని, న్యాయస్థానాల్లో పిటిషన్లు వేసి బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నారని చెప్పారు.

సర్ ఓటర్ లిస్టు ద్వారా లక్షలాదిమంది వైసీపీ అభిమానుల ఓట్లు తొలగిస్తున్నారని తమకు పాత ఓటర్ లిస్టుతోనే ఎన్నికలు జరపాలని ఆందోళనలు చేశారని, ఎన్నికలను ఏ ఓటర్ లిస్టు ప్రకారం నిర్వహించాలో నిర్ణయించేది ఎన్నికల సంఘమే తప్ప కూటమి పార్టీలు కాదన్న సంగతి వైస్సార్సీపీ నేతలకు తెలియకపోవడం విచారకరం అని అన్నారు.

కొత్త ఓటర్ లిస్టు(సర్) వచ్చేందుకు ఆలస్యం కానుండడం, అప్పటివరకు ఎన్నికలు నిర్వహించకపోవడం ద్వారా మున్సిపాలిటీ - పంచాయతీ, మండల - జడ్పీలు కేంద్ర నిధులు కోల్పోయే ప్రమాదంను ప్రభుత్వం గుర్తించిందని, ఏ ఓటర్ లిస్టు ప్రకారం ఎన్నికలను జరుపగలరో నిర్ణయం తీసుకోవాలని ఏ లిస్టు ప్రకారమైనా తాము సిద్ధంగా ఉన్నామని ఎన్నికల సంఘానికి కూటమి ప్రభుత్వం తెలియజేసిందని అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయాన్ని చూసి ఈవీఎమ్ లతో గెలిచామన్నారు, నేడు బ్యాలెట్ పేపర్లతో కూడా 2024కు మించి ఘన విజయం సాధించామని చెప్పారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE