Nellore: పాఠశాలల్లో ఘనంగా స్వచ్ఛతా హై సేవ - 2026 కార్యక్రమాలు
Nellore: నెల్లూరులోని వి.ఆర్, డి.ఎస్.ఆర్ పాఠశాలల్లో స్వచ్ఛతా హై సేవ 2026 కార్యక్రమం. విద్యార్థులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించిన మున్సిపల్ కమిషనర్ నందన్.
Nellore: పాఠశాలల్లో ఘనంగా స్వచ్ఛతా హై సేవ - 2026 కార్యక్రమాలు
నెల్లూరు: నగర స్థానిక వి.ఆర్ మున్సిపల్ పాఠశాల, మూలాపేట డి.ఎస్.ఆర్ పాఠశాలల ప్రాంగణంలో "స్వచ్ఛతా హై సేవ - 2026 లో భాగంగా " స్వచ్ఛ పాఠశాల - యూత్ ఫర్ స్వచ్ఛత" కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు.
వి.ఆర్ పాఠశాల ప్రాంగణంలో నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ విద్యార్థులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులు పాఠశాల ప్రాంగణాలను, పరిసరాలను పరిశుభ్రం చేశారు. విద్యార్థులలో వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని కమిషనర్ తెలిపారు.
డి.ఎస్.ఆర్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వాసు బాబు హాజరై విద్యార్థితో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ దినేష్,వివిధ డివిజన్లకు చెందిన వార్డు సచివాలయాల కార్యదర్శులు, పి. ఎమ్.యు. బృందం పాల్గొన్నారు.




