Nellore: ఆత్మకూరు ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించిన పాఠశాల విద్యార్థులు
Nellore: నెల్లూరు జిల్లాలో విద్యార్థులకు వృత్తి విద్యపై అవగాహన కోసం ఇండస్ట్రియల్ విజిట్. ఆత్మకూరు ఇంజనీరింగ్ కళాశాల ల్యాబ్లను సందర్శించిన విద్యార్థులు.
Nellore: ఆత్మకూరు ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించిన పాఠశాల విద్యార్థులు
నెల్లూరు: విద్యార్థులకు వృత్తి విద్యపై అవగాహన కల్పించడంతో పాటు, భవిష్యత్లో మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పారిశ్రామిక సందర్శనలు ఎంతగానో దోహదపడతాయని జీబీకేఆర్ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ ప్రధానోపాధ్యాయులు పి. బుజ్జయ్య అన్నారు.
నెల్లూరు జిల్లా సంగం మండల పరిధిలోని గొట్టి గుండాల బాలకృష్ణారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 50 మంది విద్యార్థినీ, విద్యార్థులు బుధవారం ఇండస్ట్రియల్ విజిట్లో భాగంగా ఆత్మకూరు పట్టణంలోని ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు కళాశాలలోని ఐటీ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, ఎలక్ట్రికల్ ల్యాబ్లను పరిశీలించారు.ల్యాబ్ల పనితీరు, సాంకేతిక పరిజ్ఞానం, విద్యార్థులకు అందుబాటులో ఉన్న వృత్తి విద్యా అవకాశాల గురించి కళాశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, హెచ్ఓడీలను అడిగి విద్యార్థులు తెలుసుకున్నారు.
తరగతి గదుల్లో నేర్చుకున్న అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారా విద్యార్థుల్లో సాంకేతిక విద్యపై ఆసక్తి పెరుగుతుందని ఉపాధ్యాయులు తెలిపారు.ఇలాంటి విజ్ఞాన యాత్రలు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. బుజ్జయ్య పేర్కొన్నారు. కార్యక్రమంలో దారా స్వరూప్, కె.వి. రవీంద్ర, ఎం. జయకుమార్, సిహెచ్. శిరీష తదితరులు విద్యార్థుల వెంట పాల్గొన్నారు.




