Nellore: మైదానంలో విద్యార్థులతో ఆటలాడిన మంత్రి నారాయణ కుమార్తె షరణి!
Nellore: నెల్లూరు ఎసి నగర్ MSM మున్సిపల్ హైస్కూల్ సందర్శించిన షరణి పొంగూరు. జాతీయ స్థాయి క్రీడాకారులతో కోకో, వాలీబాల్ ఆడి సొంత నిధులతో కిట్లు పంపిణీ.
Nellore: మైదానంలో విద్యార్థులతో ఆటలాడిన మంత్రి నారాయణ కుమార్తె షరణి!
నెల్లూరు: నెల్లూరు MSM మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ విద్యార్థులు క్రీడల్లో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు.. ఏకంగా ఆరుగురు విద్యార్థులు జాతీయ స్థాయిలో, మరో 30 మందికి పైగా విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఎంపికై నెల్లూరు ఘనకీర్తిని దేశవ్యాప్తంగా చాటుతున్నారు..అయితే ఈ విద్యార్థుల కష్టాన్ని, ప్రతిభను గుర్తించి.. గతంలో ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర మంత్రి నారాయణ కుమార్తె షరణి పొంగూరు ప్రత్యేకంగా MSM పాఠశాలకు విచ్చేశారు.
వేదికలకే పరిమితం కాకుండా నేరుగా మైదానంలోకి దిగిన ఆమె.. విద్యార్థులతో కలిసి కోకో, సాఫ్ట్ బాల్, వాలీబాల్ వంటి ఆటలు ఆడి మైదానంలో పండుగ వాతావరణం నింపారు..తండ్రి నారాయణలాగే మాట ఇస్తే అది అయ్యేవరకు వదలరు అని షరణి పొంగూరు మరోసారి నిరూపించారు.. నెల్లూరు ఎసి నగర్‌లోని MSM మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ ఇప్పుడు క్రీడా విప్లవానికి చిరునామాగా మారింది.
చదువుతో పాటు ఆటల్లోనూ సత్తా చాటుతూ పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో నెల్లూరు పేరును సమున్నతంగా నిలబెడుతున్నారు. ఈ పాఠశాల నుంచి అండర్-19 విభాగంలో డి. రిషిత, టి. తులసి (సాఫ్ట్ బాల్ - చండీగర్), సిహెచ్. నందిని (ఖో ఖో - మధ్యప్రదేశ్), వై. చరణ్ కుమార్ (క్రికెట్ - లక్నో), అలాగే ఇ. సిద్ధు, ఎం. జగదీష్ (అట్యా-పట్యా & ఖో ఖో - జమ్మూ కాశ్మీర్) జాతీయ స్థాయికి ఎంపిక కాగా,వీరితో పాటు మరో 30 మందికి పైగా విద్యార్థులు కోకో, సాఫ్ట్ బాల్, బేస్ బాల్, అథ్లెటిక్స్, వాలీబాల్, క్రికెట్ క్రీడలలో నెల్లూరు జిల్లా జట్టు తరఫున రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటున్నారు.
ఈ క్రమంలోనే మంత్రి నారాయణ కుమార్తె షరణి పొంగూరు పాఠశాలను సందర్శించి విద్యార్థులలో సరికొత్త జోష్ నింపారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మొదటి ప్రాధాన్యతగా ఎంఎస్ఎం స్కూల్‌కే విచ్చేశారు. పిల్లలతో ఎంతో ఆప్యాయంగా ముచ్చటించడమే కాకుండా.. మైదానంలో విద్యార్థులతో కలిసి కోకో, సాఫ్ట్ బాల్, వాలీబాల్ ఆటలు ఆడి అందరినీ ఆశ్చర్యపరిచారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన శరణి పొంగూరు.. హెచ్ఎం మురళీకృష్ణ, PD అజయ్ కుమార్ టీచర్ల కృషితోనే ఈ సాధన సాధ్యమైందని కొనియాడారు. తన సొంత నిధుల నుంచి జాతీయ స్థాయి క్రీడాకారులకు స్పోర్ట్స్ వేర్, షూస్, ట్రాక్ ప్యాంట్లు, కిట్లను అందజేశారు. MSM విద్యార్థులకు సరైన ప్రోత్సాహం అందిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నెల్లూరు ఘనతను నిలబెడతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.




