Nellore: జనంలో ఒకరిగా షరణి పొంగూరు – తిరుగులేని ప్రచార హోరు!

Nellore: నెల్లూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె షరణి పొంగూరు సందడి. మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్ గెలుపే ధ్యేయంగా ఇంటింటి ప్రచారం.

V. Narasimhulu, Nellore
Published on: 26 Oct 2026 11:31 PM IST
Nellore
X

Nellore: జనంలో ఒకరిగా షరణి పొంగూరు – తిరుగులేని ప్రచార హోరు!

నెల్లూరు: నెల్లూరు మున్సిపల్ ఎన్నికల ప్రచార రణరంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె షరణి పొంగూరు చేపడుతున్న హోరాహోరీ ప్రచారం నియోజకవర్గవ్యాప్తంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తూ విశేష ఆకర్షణగా నిలిచింది. కూటమి మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్ తో పాటు 65వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి ధర్మవరపు గణేష్ కుమార్, 61వ డివిజన్ అభ్యర్థి ఆనం రంగ మయూర్ రెడ్డి, 64వ డివిజన్ అభ్యర్థి నజుమా, మరియు 63వ డివిజన్ అభ్యర్థి జుబేర్‌ల ఘన విజయే ధ్యేయంగా ఆమె అహోరాత్రులు శ్రమిస్తూ, డివిజన్లను చుట్టేస్తున్నారు.

ప్రచారంలో భాగంగా గత రెండున్నరేళ్లలో నెల్లూరు నగరాభివృద్ధికి ప్రభుత్వం ఏకంగా 5,748 కోట్లు కేటాయించి చేసిన చారిత్రాత్మక అభివృద్ధిని ప్రతి ఇంటికీ వివరిస్తూ, సింహపురిని హరితవనంగా తీర్చిదిద్దే పనులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, పాఠశాలల ఆధునీకరణ, ప్రతి ఇంటికీ మంచినీటి కుళాయి పథకాలపై ప్రజల్లో నమ్మకం నింపుతున్నారు.

రాజకీయంలో వినూత్న శైలిని ప్రదర్శిస్తూ తానే స్వయంగా గిడ్డంగి వీధి హోటల్‌లో బిర్యానీ వడ్డించడం, రోడ్డు పక్కన కొబ్బరి బొండాలు తాగుతూ కార్యకర్తలకు పంచడం, స్వీట్ షాప్‌లో స్వీట్లు తింటూ వ్యాపారుల సాధక బాధకాలు తెలుసుకోవడం, బత్తాయి జ్యూస్ చేసి అందించడం, టీ కొట్టు వద్ద నిలబడి 'చాయ్ పే చర్చ' చేస్తూ స్థానికులతో మమేకం కావడం జిల్లావ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టిస్తోంది.

మహిళలు అడుగడుగునా హారతులు పట్టి దిష్టి తీస్తూ ఆత్మీయతను చాటుకుంటుండగా, మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్ లక్షకు పైగా మెజారిటీతో గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేస్తూ, కూటమి అభ్యర్థులందరినీ సైకిల్ గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని షరణి పొంగూరు పిలుపునిచ్చారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore