Nellore: మంత్రి నారాయణ అభివృద్ధే శ్రీరామరక్ష షరణి పొంగూరు
Nellore: నెల్లూరు 62వ డివిజన్‌లో టిడిపీ అభ్యర్థి పొట్లూరి రామకృష్ణ భారీ విజయం. విజయోత్సవ ర్యాలీలో పాల్గొని కృతజ్ఞతలు తెలిపిన మంత్రి నారాయణ కుమార్తె షరణి.
Nellore: మంత్రి నారాయణ అభివృద్ధే శ్రీరామరక్ష షరణి పొంగూరు
నెల్లూరు: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 62వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసిన పొట్లూరి రామకృష్ణ 2153 ఓట్ల భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించగా, ఎన్నికల సమయంలో స్వయంగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి నారాయణ కుమార్తె షరణి, గెలిచిన తర్వాత కూడా మళ్లీ విజయోత్సవ ర్యాలీలో పాల్గొని డివిజన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
కోటమిట్ట మహాలక్ష్మమ్మ గుడి వద్ద నుండి అత్యంత ఘనంగా ప్రారంభమైన ఈ విజయత్సవ ర్యాలీకి విచ్చేసిన షరణికి డివిజన్ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. గతంలో ఆమె ఇంటింటికి తిరిగి ప్రచారం చేసినప్పుడు ప్రజలు, కార్యకర్తలు ఆమెకు స్వాగతం పలికి ఎంతగానో ఆదరించారని గుర్తుచేస్తూ, భారీగా బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకుంటూ ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు.
అనంతరం షరణి మీడియాతో మాట్లాడుతూ, నెల్లూరు నగరంలో నారాయణ గత రెండున్నరేళ్లలో 5 వేల కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరడం వల్లే ప్రజలు టిడిపిని భారీ మెజారిటీతో గెలిపించారని, భవిష్యత్తులోనూ ప్రజలందరికీ మెరుగైన సేవలు అందిస్తామని పేర్కొంటూ కృతజ్ఞతలు తెలిపారు.




