Nellore: సర్వేపల్లిలో కూటమి అభ్యర్థుల ప్రచారం: సోమిరెడ్డి పిలుపు!

Nellore: ముత్తుకూరు మండలం పిడతపోలూరు, బ్రహ్మదేవంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పాల్గొని కూటమి అభ్యర్థుల గెలుపును కోరారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 29 Oct 2026 6:52 PM IST
Nellore
X

Nellore: సర్వేపల్లిలో కూటమి అభ్యర్థుల ప్రచారం: సోమిరెడ్డి పిలుపు!

నెల్లూరు: నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ​ముత్తుకూరు మండలం పిడతపోలూరు, బ్రహ్మదేవంలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ ​స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి తరఫున నిలబడిన అభ్యర్థుల గుణగణాలు, వారు చేసిన సేవా కార్యక్రమాలను చూసి ప్రజలు ఓటు వేయాలని డిమాండ్ చేశారు.

​కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, మోదీల నాయకత్వంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం అమలవుతున్నాయని అన్నారు. ​స్థానిక సంస్థల నిధులు పూర్తిగా పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లకే అందేలా పవన్ కళ్యాణ్ స్పష్టమైన హామీ ఇచ్చారని ​నియోజకవర్గంలో వ్యవసాయం కోసం త్రీ-ఫేస్ విద్యుత్‌కు రూ. 110 కోట్లు, ఎస్సీ, ఎస్టీలకు సోలార్ పంపుసెట్ల కోసం రూ. 55 కోట్లు, రక్షిత తాగునీటి పథకాల కోసం రూ. 100 కోట్లకు పైగా నిధులు కేటాయించామని,

​గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో సర్వేపల్లి నియోజకవర్గంలో 7,000 ఎకరాలకు పైగా, మొత్తం రాష్ట్రంలో 70,000 ఎకరాలకు పైగా సీజేఎఫ్‌ఎస్ భూములకు డీకేటీ పట్టాలు ఇప్పించి రైతులకు హక్కులు కల్పించామని అన్నారు. ​బ్రహ్మదేవం - జెన్కో రోడ్ సెంటర్‌లో సీఎస్సార్ (CSR) నిధుల ద్వారా సుమారు రూ. 4.5 కోట్లతో సీహెచ్‌సీ (CHC) స్థాయి అత్యాధునిక ఆసుపత్రి భవన నిర్మాణాన్ని చేపడుతున్నామని, అలాగే ​విద్యార్థినుల కోసం గతంలో 1,800 సైకిళ్లు అందించామని, ఈ ఏడాది మరో 2,000 సైకిళ్లు పంపిణీ చేయబోతున్నామని స్పష్టం చేశారు.

​గత వైసీపీ పాలనలో గిరిజనులు, పేదల భూములను తక్కువ ధరకు లాక్కొని, మట్టి తవ్వి అమ్ముకుంటూ రొయ్యల గుంతలుగా మార్చారన సోమిరెడ్డి ఆరోపించారు. ​పల్లిపాటిదిబ్బలో నకిలీ గోవా మద్యం తాగి అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, ఆ కేసుల్లో చిక్కుకున్న వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. ​పేదల భూములు ఆక్రమించి అక్రమాలకు పాల్పడిన వారికి కాకుండా, ప్రజా సంక్షేమం కోసం పాటుపడే కూటమి అభ్యర్థులకే ప్రజలు ఓటు వేసి గెలిపించాలని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ముత్తుకూరు మండల అధ్యక్షుడు మల్లికార్జున యాదవ్ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్