Nellore: వైఎస్సార్‌సీపీకి మరో బిగ్ షాక్ టీడీపీలోకి సన్నపురెడ్డి సోదరులు!

Nellore: వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసిన సన్నపురెడ్డి సోదరులు. రేపు మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి సమక్షంలో అధికార టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

V. Narasimhulu, Nellore
Published on: 16 Oct 2026 5:37 PM IST
Nellore
X

Nellore: వైఎస్సార్‌సీపీకి మరో బిగ్ షాక్ టీడీపీలోకి సన్నపురెడ్డి సోదరులు!

నెల్లూరు: వైఎస్ఆర్సీపీ, కూటమి నాయకులకు ఆ పార్టీ నేతలు షాక్ ల మీద షాకులిస్తున్నారు...ఈ నేపథ్యంలో అభివృద్ధి కే మా మద్దతు అంటూ అధికార టీడీపీ వైపు కొందరు అడుగులు వేస్తున్నారు. రోజుకో డివిజన్ లో కండువాలు మారుస్తూ వలస బాట పడుతున్నారు.

సుదీర్గ రాజకీయ అనుభవం ఉన్న సన్నపురెడ్డి సోదరులు

సన్నపురెడ్డి ఆఫీస్ కి వెళ్లి మంత్రి నారాయణ, ఎంఎల్ఏ శ్రీధర్ రెడ్డిలు ఆహ్వానించటంతో సోదరులు,వారి సహచరులు రేపు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు.ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ పెంచలరెడ్డి , సుబ్బారెడ్డి ,శ్రీనివాస్ ముగ్గురూ వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడానికి నిర్ణయించుకోవటం శుభ పరిణామమన్నారు.

రూరల్ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ సన్నపురెడ్డి పెంచలరెడ్డి , వారి సోదరుడు సుబ్బారెడ్డి నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో మంచి పలుకుబడి ఉన్న నేతలని. వీరితో పాటు మంచికంటి శ్రీనివాసులు కూడా వైసీపీకి రాజీనామా చేసి, మంత్రి నారాయణ ఆధ్వర్యంలో టీడీపీలో చేరుతుండటం సంతోషకరం అన్నారు. సన్నపురెడ్డి సోదరులు ఏ పార్టీలో ఉన్నా నిబద్ధతతో, అంకితభావంతో కష్టపడి పనిచేస్తారన్నారు. రేపు వారు అధికారికంగా పార్టీలో చేరుతారన్నారు.

సన్నపు రెడ్డి పెంచలరెడ్డి మాట్లాడుతూ...

అంకితభావంతో పనిచేస్తూ ప్రజల్లో మమేకమైన తమను విస్మరించడం వల్లనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు.కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తామన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore