Nellore: నెల్లూరు రూరల్‌లో టీడీపీలోకి భారీ చేరికలు!

Nellore: నెల్లూరు రూరల్‌లో వైఎస్సార్‌సీపీకి చెందిన పలువురు నేతలు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు.

V. Narasimhulu, Nellore
Published on: 16 Oct 2026 7:28 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు రూరల్‌లో టీడీపీలోకి భారీ చేరికలు!

నెల్లూరు: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో 35వ డివిజన్, చలపతి నగర్ కు చెందిన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కి చెందిన బాల నారాయణ రెడ్డి, నన్నం జయపాల్, బోయరాజు, నారాయణ రాజు, రమేష్ వారి మిత్రబృందం చేరారు.

ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ...

చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా నెల్లూరు రూరల్ లో అభివృద్ధి. ఎన్నికల సమయంలో మాత్రమే కనపడేవాళ్ళు కాకుండా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉండే కూటమి అభ్యర్థులను ఆశీర్వదించి, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు...నెల్లూరు రూరల్ లో 36 డివిజన్ లలో మేయర్ అభ్యర్థి, కార్పొరేటర్ అభ్యర్థులకు ప్రజలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు.

పై కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దుద్దుగుంట శ్రీనివాసులు రెడ్డి, మేకల మధు, పుల్లారెడ్డి, చల్లా సుబ్బన్న, మస్తాన్ రెడ్డి, మల్లికార్జున, రమణయ్య, మురళి రెడ్డి, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore