Nellore: నెల్లూరు రూరల్లో వైసీపీకి మరో షాక్.. టీడీపీలోకి కీలక నేతలు!
Nellore: నెల్లూరు రూరల్ నియోజకవర్గం 5వ డివిజన్ వావిలేటిపాడుకు చెందిన పలువురు వైసీపీ నేతలు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు.
Nellore: నెల్లూరు రూరల్లో వైసీపీకి మరో షాక్.. టీడీపీలోకి కీలక నేతలు!
నెల్లూరు: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. 5వ డివిజన్ వావిలేటిపాడుకు చెందిన పలువురు వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో వైసీపీ నాయకులు మోపూరు మోహన్ రెడ్డి, మోపూరు అశోక్ రెడ్డి, గండవరపు సుమన్ రెడ్డితో పాటు వారి మిత్రబృందం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి నాయకులు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు మేలు జరిగేలా, పదిమందికి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. ప్రజాసేవలో ముందుండే వారికి స్థానిక ఎమ్మెల్యేగా తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీతో పాటు కూటమిని మరింత బలోపేతం చేసే దిశగా సమష్టిగా అడుగులు వేస్తామని తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలంతా కలిసికట్టుగా ఒకే తాటిపై ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. తనపై నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో 5వ డివిజన్ కార్పొరేటర్ అబ్రహం, క్లస్టర్ ఇన్చార్జి సాబీర్ ఖాన్, టీడీపీ నాయకులు మడపర్తి శ్రీనివాసులు, చింతా ప్రభాకర్ రెడ్డి, అన్నపరెడ్డి సురేష్, కుండా వెంకట రమణయ్య, విజయభాస్కర్, మస్తానయ్య, రవిరెడ్డి, వెంకట కృష్ణయ్య, సుధాకర్, మలాకి, నందా తదితరులు పాల్గొన్నారు.




