Nellore: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా
Nellore: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. భారీ కేక్ కట్ చేసి సేవా కార్యక్రమాలను అభినందించారు.
Nellore: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా
నెల్లూరు: నెల్లూరు రూరల్ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు భారీ కేక్‌ను ఏర్పాటు చేసి జన్మదిన వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.
కార్యక్రమానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాజరై భారీ కేక్‌ను కట్ చేశారు. అనంతరం నాయకులు, కార్యకర్తలకు కేక్‌ను పంచిపెట్టి, తన జన్మదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే జన్మదిన వేడుకలతో కార్యాలయ ప్రాంగణం సందడిగా మారింది.
కార్యకర్తలకు ఎప్పటికీ రుణపడి ఉంటా
ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలంటే ఎంతో ఇష్టం: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన నాయకులు, కార్యకర్తలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహించడం తనకు ఎంతో ఇష్టమని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. తన జన్మదినం సందర్భంగా పలువురు నాయకులు రక్తదాన శిబిరాలు నిర్వహించడం, అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు పంపిణీ చేయడం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
రూరల్ నియోజకవర్గంలో తనపై చూపుతున్న అభిమానం, ఆప్యాయతలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని నాయకులు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.




