Nellore: నెల్లూరు రూరల్ అభివృద్ధే మా ఏకైక లక్ష్యం గిరిధర్ రెడ్డి!

Nellore: నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధే తమ ఏకైక లక్ష్యమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. వివిధ గ్రామాల్లో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు.

A Praveen, Nellore
Published on: 30 Sept 2026 12:38 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు రూరల్ అభివృద్ధే మా ఏకైక లక్ష్యం గిరిధర్ రెడ్డి!

Nellore: నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధే తమ ఏకైక లక్ష్యమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పాత వెల్లంటి గ్రామంలో రూ.56 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు, కొండ్లపూడి గ్రామంలో రూ.39 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు నెల్లూరు ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజలకు అవసరమైన రహదారులు, డ్రైనేజీ, తాగునీరు తదితర సదుపాయాలను మెరుగుపరుస్తూ గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.

ప్రజల అవసరాలను గుర్తించి దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ప్రతి గ్రామంలో మౌలిక వసతులను మెరుగుపరిచే దిశగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

“మా జెండా.. అజెండా ఒక్కటే.. నెల్లూరు రూరల్ అభివృద్ధే” అని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల ఆశీస్సులు, సహకారంతో మరింత ఉత్సాహంగా పనిచేస్తామని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే కూటమి అభ్యర్థులకు ఓటు వేసి విజయాన్ని అందించాలని ఆయన ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చైర్మన్ ఇందుపూరు అచ్యుత్ రెడ్డి, మండల కన్వీనర్ పముజుల ప్రదీప్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ మండల ఇన్‌చార్జ్ వేమిరెడ్డి సురేంద్ర రెడ్డి, టీడీపీ నాయకులు కుండా మురళీకుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, వెంకటేశ్వర్లు, సుధాకర్, ఉదయ్ భాస్కర్, పిడుగు సాయి, సీపీఎం నాయకులు చెంచయ్య, నారాయణ, సుబ్రహ్మణ్యం, మస్తానయ్య, రామచంద్రయ్యతో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

A Praveen, Nellore

A Praveen, Nellore