Nellore: రూరల్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి!

Nellore: నెల్లూరు రూరల్‌లోని 9 డివిజన్లలో రూ.2.83 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE
Updated on: 8 Oct 2026 1:33 PM IST
Nellore
X

Nellore: రూరల్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి!

Nellore: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 24, 25, 26, 30, 31, 32, 34, 36, 41 డివిజన్లలో 2కోట్ల 83 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేశారు స్థానిక ప్రజలు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు..

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో వాడవాడలా ప్రతి ప్రాంతంలో కూడా రోడ్లు, కాలువలు, కరెంట్, మంచినీటి సౌకర్యం, స్మశానాలు, పార్కులు వివిధ అభివృద్ధి పనుల కోసం ఇప్పటిదాకా జరిగిన, జరుగుతున్న, టెండర్లు పిలిచిన అభివృద్ధి పనుల విలువ 966 కోట్ల రూపాయిలు అని చెప్పారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , యువనేత రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆశీస్సులతో అదేవిధంగా జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ , ఆనం రామనారాయణ రెడ్డి , పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర , జిల్లా కలెక్టర్, నగర కమిషనర్ ,వీరందరి సహాయ సహకారాలతో ఈ యొక్క అభివృద్ధి పనులు చేసుకోగలిగాం అని అన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

ఇంత అభివృద్ధి చేస్తూ, ఇన్ని మంచి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఈ మంచి ప్రభుత్వం, ఈ ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని, త్వరలో జరగబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీ అభ్యర్థుల్ని తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ అభ్యర్థుల్ని ప్రజలందరూ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆశీర్వదిస్తే నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డికి ఇంకా కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వద్ద ఇంకా గౌరవం దక్కుతుందని చెప్పారు..తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లలో అటు కార్పొరేటర్ కి గాని, మేయర్ అభ్యర్థికి గాని కూటమి అభ్యర్థులను గెలిపించినట్లయితే భవిష్యత్తులో ఇంకా ఎక్కువ నిధులు తెచ్చి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ పనులు చేయాలో అవన్నీ కూడా ఆ డివిజన్ లలో ఉన్న స్థానిక ప్రజల సలహా సూచనల మేరకు, కూటమి నాయకుల సలహా సూచనల మేరకు ఈ పనులన్నీ కూడా చేయడం జరుగుతుందని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి చెప్పారు

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE