Nellore: నెల్లూరు జిల్లాలో రూ.380 కోట్ల హ్యామ్ పనులకు శంకుస్థాపన
Nellore: నెల్లూరు జిల్లాలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద రూ.380 కోట్ల విలువైన 62 అభివృద్ధి పనులకు ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శంకుస్థాపన చేశారు.
Nellore: నెల్లూరు జిల్లాలో రూ.380 కోట్ల హ్యామ్ పనులకు శంకుస్థాపన
నెల్లూరు జిల్లా: నెల్లూరు జిల్లా చరిత్రలోనే మరపురాని విధంగా మైపాడు గేట్ సెంటర్‌లోని డిజిపి కళ్యాణ మండపంలో నగరపాలక సంస్థ మరియు మున్సిపాలిటీల పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. సభారంభంలో వేదికపై ఉన్న ప్రజాప్రతినిధులు మరియు నాయకులు ముందుగా దివ్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా ప్రారంభించగా, ఈ శంకుస్థాపన మహోత్సవంలోనే నగరాభివృద్ధికి సంబంధించిన శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరించి ప్రారంభించారు.
హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) పథకం ద్వారా జిల్లావ్యాప్తంగా 380 కోట్ల అంచనా వ్యయంతో 62 అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరగ్గా, అందులో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో మంజూరైన 240 కోట్ల భారీ బడ్జెట్ విలువైన 24 అభివృద్ధి పనులకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేయర్ సుజాత, మరియు కార్పొరేషన్ కమిషనర్ నందన్ ఘనంగా శంకుస్థాపన చేశారు.
ఈ నిధులతో పట్టణ ప్రాంతాల్లో రహదారులు, సెంట్రల్ మీడియన్స్, సెంట్రల్ లైటింగ్, పార్కులు తదితర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నారు. ఇక జిల్లాలోని కావలి మున్సిపాలిటీ పరిధిలో 8 పనులకు 40 కోట్లు, గూడూరు మున్సిపాలిటీలో 12 పనులకు 30 కోట్లు, ఆత్మకూరు మున్సిపాలిటీలో 6 పనులకు 29 కోట్లు, బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో 5 పనులకు 22 కోట్లు, అల్లూరు నగర పంచాయతీ పరిధిలో 7 పనులకు 19 కోట్లు చొప్పున నిధులు మంజూరయ్యాయి.
ఈ చారిత్రాత్మక ఘట్టం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మంజూరైన 8,000 కోట్ల హామ్ పనులకు కుప్పం నుంచి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసి సందేశమివ్వగా, విశాఖపట్నం నుంచి పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు ప్రత్యేకంగా ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ... పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ కృషి వల్లే ఈ నిధుల మంజూరు సాధ్యమైందని, జిల్లాను సర్వతోముఖాభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని తెలిపారు..అలాగే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీ మరియు ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 872 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు.
ఈ విజయోత్సాహంతో టీడీపీ నాయకులు, శ్రేణులు మరియు కార్యకర్తల అపూర్వ జనసందోహంతో డిజిపి కళ్యాణ మండపం ప్రాంగణమంతా కిక్కిరిసిపోయి శంకుస్థాపన వేడుక పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.
ఈ అభివృద్ధి వేడుకలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ తాళ్ళపాక అనూరాధ, మాజీ జడ్పిటిసి విజేతా రెడ్డి, నగర పార్టీ అధ్యక్షుడు మామిడాల మధు, మరియు రాష్ట్ర వేర్‌హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కపిర శ్రీనివాసులు తదితర ప్రముఖ నేతలందరూ విశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని మహోజ్వలంగా విజయవంతం చేశారు.




