Nellore: రైస్ మిల్లులు కాలుష్య నిబంధనలు పాటించాలి: పీసీబీ ఈఈ అశోక్ కుమార్

Nellore: నెల్లూరు నగర పరిధిలోని రైస్ మిల్లులు కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటించాలని, లేనిపక్షంలో భారీ జరిమానాలు విధిస్తామని పీసీబీ ఈఈ అశోక్ కుమార్ స్పష్టం చేశారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 3 Oct 2026 6:52 PM IST
Nellore
X

Nellore: రైస్ మిల్లులు కాలుష్య నిబంధనలు పాటించాలి: పీసీబీ ఈఈ అశోక్ కుమార్

Nellore: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నెల్లూరు నగర పరిధిలోని 64 రైస్ మిల్లుల యజమానులు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలకు అనుగుణంగా మిల్లులను నడపాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నెల్లూరు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ అశోక్ కుమార్ సూచించారు. నెల్లూరులోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సమావేశ మందిరంలో ఈరోజు మిల్లుల యజమానులకు అవగాహన సదస్సును నిర్వహించారు.

ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ... ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే కాలుష్యాన్ని నివారించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్యల సూచనల మేరకు ఈ సదస్సులను నిర్వహిస్తున్నామన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని.. ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా నిర్వహించుకోవాలని చెప్పడమే తమ ఉద్దేశమన్నారు. నెల్లూరు నగర పరిధిలోని

రైస్ మిల్లులు వెలువరిస్తున్న కాలుష్యం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని పలువురు ప్రజాప్రతినిధులు.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చారన్నారు. గత రెండు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి నెల్లూరు ప్రాంతీయ కార్యాలయ అధికారులు 64 రైస్ మిల్లులను ప్రత్యక్షంగా పరిశీలించి కాలుష్యం వెలువడకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వస్తున్న యంత్రాలను బిగించుకోవాలని పలు మార్లు సూచించారు. 33 మంది మిల్లుల యజమానులు మాత్రమే వీటికి స్పందించి బా యిలర్ల నుంచి వచ్చే. దుమ్మును అరికట్టే యంత్రాలను బింగించు కున్నారన్నారు. 31 మిల్లుల యజమానులు కూడా కాలుష్య ప్రమాణాలను పాటించే చర్యలను చేపట్టాలని అశోక్ కుమార్ సూచించారు.

బాయిలర్ల నుంచి వెలువడే దుమ్ము ను నివారించేందుకు అవసరమైన పరికరాలు బిగించే వరకూ బాయిలర్ లను నడపవద్దని సూచించారు.

అయినా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న మిల్లులకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలకు అనుగుణంగా జరిమానా విధించనున్నామని చెప్పారు.

కాలుష్య నియంత్రణకు అవసరమైన సాంకేతిక పరికరాల వినియోగం. .. వాటి నిర్వహణపై త్వరలోనే ఒక వర్క్ షాప్ ను కూడా నిర్వహిస్తామన్నారు. బాయిలర్లతోపాటు ఇతర యంత్రాల నిర్వహణపై ఉద్యోగులకు నిపుణులు అవగాహన కల్పిస్తారన్నారు. ప్రతి మిల్లులో కూడా గ్రీన్ బెల్ట్ ను అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని యజమానులు గుర్తుంచుకోవాలన్నారు. మిల్లులో నుంచి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయవచ్చన్నారు.

ఏయే ఉత్పత్తులు తయారు చేయవచ్చనే అంశంపై కూడా ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తామన్నారు. కాలుష్య నియంత్రణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉందని..ఈ విషయంపై అందరూ కూడా దృష్టి సారించాలని అశోక్ కుమార్ కోరారు. ఈ సందర్భంగా రైస్ మిల్లు యజమానులు లేవనెత్తిన పలు సందేహాలను ఆయన నివృత్తి చేశారు. ఈ సమావేశంలో నెల్లూరు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రంగయ్య నాయుడు.. నాయకులు సుబ్రమణ్యం రెడ్డి.. కోటేశ్వరరావు. పలువురు మిల్లుల యజమానులు పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE