Nellore: బి.వి. నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి పనులపై అధికారులతో సమీక్ష

Nellore: నెల్లూరు బి.వి. నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులపై మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో కమిషనర్ నందన్, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమీక్ష.

V. Narasimhulu, Nellore
Published on: 18 Sept 2026 11:11 PM IST
Nellore
X

Nellore: బి.వి. నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి పనులపై అధికారులతో సమీక్ష

నెల్లూరు: నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని బి.వి. నగర్ నగర్ నందు రైల్వే అండర్ బ్రిడ్జి అనుమతులు మంజూరు అయి, పనుల ప్రారంభం కోసం రైల్వే అధికారులు, ఆర్ & బి , మున్సిపల్ కార్పొరేషన్, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, పబ్లిక్ హెల్త్ అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించిన నెల్లూరు మున్సిపల్ కమిషనర్ వై.ఓ. నందన్. ఈ సమావేశంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని బి.వి. నగర్‌లో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు మంజూరు కావడంతో, పనులను త్వరితగతిన ప్రారంభించే దిశగా అధికారులు సమన్వయంతో చర్యలు చేపడుతున్నారని మున్సిపల్ కమిషనర్ వై.ఓ. నందన్ వెల్లడించారు.

రైల్వే, ఆర్ & బి, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్, రెవెన్యూ, విద్యుత్, పబ్లిక్ హెల్త్ తదితర శాఖల అధికారులు సమావేశంలో పాల్గొని అండర్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించామని చెప్పారు.

బి.వి. నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన శాఖల మధ్య సమన్వయం, స్థల పరిశీలన, విద్యుత్ మరియు ఇతర సౌకర్యాల మార్పిడి, నిర్మాణ పనులకు ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై వివిధ శాఖల అధికారులతో కలిసి సమగ్రంగా చర్చించామని చెప్పారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

బి.వి. నగర్ ప్రజలకు ఎంతోకాలంగా అవసరమైన రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించి, పూర్తి చేసేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని, అండర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే బి.వి. నగర్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు, రైల్వే గేటు వద్ద ఎదురయ్యే ఇబ్బందులు తగ్గనున్నాయని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore