Nellore: జోరేపల్లిలో టీడీపీ సర్పంచ్ అభ్యర్థుల మద్దతుగా భారీ ర్యాలీ!

Nellore: నెల్లూరు జిల్లా రాపూరు మండలం జోరేపల్లి, అక్కమాంబపురం టీడీపీ సర్పంచ్ అభ్యర్థులు దందోలు మమతమ్మ, విష్ణుప్రియలు 600 మందితో భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్లు దాఖలు చేశారు.

Yellayya, Nellore
Published on: 21 Nov 2026 2:48 PM IST
Nellore
X

Nellore: జోరేపల్లిలో టీడీపీ సర్పంచ్ అభ్యర్థుల మద్దతుగా భారీ ర్యాలీ!

నెల్లూరు: నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని జోరేపల్లి, అక్కమాంబపురం గ్రామాల్లో టీడీపీ సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న దందోలు మమతమ్మ, విష్ణుప్రియలకు రాపూరు సొసైటీ అధ్యక్షుడు దందోలు వెంకటేశ్వర్లు రెడ్డి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా సుమారు 600 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీగా బయలుదేరిన నాయకులు రామమందిరం దేవస్థానం, ఆంజనేయస్వామి దేవస్థానం, ఓసూరమ్మ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని, అక్కడి నుంచి గ్రామ సచివాలయానికి చేరుకుని సర్పంచి అభ్యర్థులు దందోలు మమతమ్మ, విష్ణుప్రియలు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అఖిల్ రమణారెడ్డి, హరికృష్ణ రెడ్డి, రాజమోహన్ రెడ్డి, రామచంద్ర యాదవ్, రామ్మోహన్ గౌడ్, నరేంద్ర గౌడ్, రవి యాదవ్, గోపి గౌడ్, దాసరి వెంకటరత్నం, వంగపాటి అంకయ్య, కాకి మస్తాన్, రాంబాబు గౌడ్, రవి గౌడ్,హరికృష్ణ,కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Yellayya, Nellore

Yellayya, Nellore