Nellore: పొర్లుకట్టలో రాణా ప్రమోద్ రెడ్డికి అడుగడుగునా ఘన స్వాగతం!

Nellore: నెల్లూరు పొర్లుకట్టలో పర్వతరెడ్డి రాణా ప్రమోద్ రెడ్డి వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం. మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పిలుపు.

V. Narasimhulu, Nellore
Published on: 24 Oct 2026 9:37 PM IST
Nellore
X

Nellore: పొర్లుకట్టలో రాణా ప్రమోద్ రెడ్డికి అడుగడుగునా ఘన స్వాగతం!

నెల్లూరు: నెల్లూరు పొర్లుకట్టలో వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్, MLC పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కుమారుడు పర్వత రెడ్డి రాణా ప్రమోద్ రెడ్డి, వైసిపి మేధావులు ఫోరం రాష్ట్ర అధికార ప్రతినిధి సమీర్ ఖాన్ ,వైసిపి సీనియర్ నాయకులు జియాఉల్ హక్ ,64వ డివిజన్ వైసిపి కార్పొరేటర్ అభ్యర్థి మహ్మద్ కౌసర్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఇంటింటికి వెళ్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధిని.. రాణా ప్రమోద్ రెడ్డి ప్రజలకు వివరించారు. కార్పొరేషన్ ఎన్ని కల్లో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి.. వైసిపి మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డిని,64వ డివిజన్ వైసిపి కార్పొరేటర్ అభ్యర్థి మహ్మద్ కౌసర్ ని గెలిపించాలని కోరారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore