Nellore: అంగరంగ వైభవంగా ‘నెల్లూరు నెరజాణ–2026’ గ్రాండ్ ఫినాలే
Nellore: నెల్లూరులో ఘనంగా ‘నెల్లూరు నెరజాణ–2026’ గ్రాండ్ ఫినాలే. శివ రుద్ర ఫౌండేషన్ అధ్యక్షురాలు టి. శిరీష ఆధ్వర్యంలో ఫ్యాషన్, ప్రతిభ వేదికగా వేడుకలు.
Nellore: అంగరంగ వైభవంగా ‘నెల్లూరు నెరజాణ–2026’ గ్రాండ్ ఫినాలే
నెల్లూరు: నెల్లూరు నగరంలోని స్వర్ణ వేదిక హాల్‌లో నిర్వహించిన ‘నెల్లూరు నెరజాణ–2026’ గ్రాండ్ ఫినాలే అంగరంగ వైభవంగా జరిగింది. ఫ్యాషన్, గ్లామర్, ప్రతిభ, ఆత్మవిశ్వాసానికి వేదికగా నిలిచిన ఈ కార్యక్రమానికి 200 మందికి పైగా హాజరై సందడి చేశారు.
శివ రుద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో, ఫౌండేషన్ అధ్యక్షురాలు, ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ చీఫ్ టి. శిరీష నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రత్యేక గుర్తింపు కల్పిస్తూ విజేతలకు ప్రతిష్టాత్మక టైటిల్స్‌ను అందజేశారు.
ప్రముఖుల సందడి
గ్రాండ్ ఫినాలే కార్యక్రమానికి ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ షమిలి, గ్రూమింగ్ డైరెక్టర్ సుమంత్, గౌరవ అతిథిగా డా. వంశీ కృష్ణ హాజరై కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా పాల్గొన్న వారికి మేకప్, గ్రూమింగ్‌లో మేకప్ ఆర్టిస్టులు తమ ప్రతిభను ప్రదర్శించారు. వారి సేవలను నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందించారు.
వి.కె. గ్రూప్ ఆఫ్ బిజినెస్ అండ్ సర్వీసెస్ వ్యవస్థాపకులు, సీఈఓ, వంశీ టీవీ, సౌమిత్ మీడియా వ్యవస్థాపకులు, మీడియా ఎడిటర్ డా. వంశీ కృష్ణకు నిర్వాహకులు ప్రత్యేక గౌరవం అందించారు.
ఈ సందర్భంగా నిర్వాహకురాలు టి. శిరీష మాట్లాడుతూ.. నెల్లూరు నగరంలో ఫ్యాషన్, గ్లామర్‌తో పాటు స్థానికంగా ఉన్న ప్రతిభను వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ‘నెల్లూరు నెరజాణ–2026’ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమానికి 200 మందికి పైగా హాజరై విజయవంతం చేయడం ఆనందంగా ఉందన్నారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విజేతలు, పాల్గొన్న ప్రతిభావంతులు, జ్యూరీ సభ్యులు, ప్రముఖులు, మేకప్ ఆర్టిస్టులు బి. ప్రణీత, బి. ప్రియాంక, టి. శ్రీజ, మీడియా ప్రతినిధులు, సహకరించిన ప్రతి ఒక్కరికీ శివ రుద్ర ఫౌండేషన్ తరఫున ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఫ్యాషన్ రంగంలో ప్రతిభకు ప్రోత్సాహం అందిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది.




