Nellore: నెల్లూరులో కూటమి అభ్యర్థుల విజయం కోరుతూ విస్తృత ప్రచారం!

Nellore: నెల్లూరు 21వ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్థి విజయలక్ష్మి, మేయర్ అభ్యర్థి రూప్‌కుమార్ యాదవ్‌ల గెలుపు కోరుతూ కూటమి నాయకుల విస్తృత ఎన్నికల ప్రచారం.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 26 Oct 2026 7:17 PM IST
Nellore
X

Nellore: నెల్లూరులో కూటమి అభ్యర్థుల విజయం కోరుతూ విస్తృత ప్రచారం!

Nellore: నెల్లూరు నగర అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలనే సంకల్పంతో, 21వ డివిజన్‌లో కూటమి బలపరిచిన జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి గునుకుల విజయలక్ష్మి ని గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని, నెల్లూరు నగర మేయర్‌గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్ ని సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ కూటమి నాయకులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ చైర్‌పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు విజేత , 16వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ సాయి, ముంగమూరు కుటుంబ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్న ముంగమూరు యశ్వంత్ కేవీ రెడ్డి, భాస్కర్ రెడ్డి, బాలాజీ, మధు, శ్రీనివాసులు తదితర నాయకులు పాల్గొని ఇంటింటికీ వెళ్లి కూటమి అభ్యర్థులకు మద్దతు కోరారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE