Nellore: నెల్లూరు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో స్వల్ప జాప్యం!

Nellore: నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల కౌంటింగ్ ఆలస్యంగా ప్రారంభం. ఏజెంట్ల రాకలో జాప్యంతో ఉత్కంఠ. ఎట్టకేలకు స్ట్రాంగ్ రూమ్‌లు తెరిచి లెక్కింపు మొదలు పెట్టిన అధికారులు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 3 Nov 2026 11:06 AM IST
Nellore
X

Nellore: నెల్లూరు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో స్వల్ప జాప్యం!

Nellore: స్థానిక ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పార్టీ శ్రేణులు, ప్రజలకు కౌంటింగ్ కేంద్రానికి సకాలంలో ఏజెంట్లు రాకపోవడంతో జరుగుతున్న జాప్యం, మరింత ఉత్కంఠను రేపుతోంది. పురపాలక ఎన్నికల కౌంటింగ్ లో ప్రారంభం ఆలస్యంగా కొనసాగుతోంది. నెల్లూరు నగరపాలక సంస్థ కౌంటింగ్ సంబంధించిన పూర్తిస్థాయిలో ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోక పోవడంతో అధికారులు వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురైంది.

ఏజెంట్లు మొత్తం వచ్చిన తర్వాతనే కౌంటింగ్ ప్రారంభించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి ఆనం విజయ కుమార్ రెడ్డి అధికారులను కోరారు. నెల్లూరు ఎట్టకేలకు అధికారుల సమక్షంలో స్ట్రాంగ్ ను ఓపెన్ చేయడంతో కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE