Nellore: నెల్లూరులో టీడీపీలోకి వైసీపీ మైనారిటీ నేతల చేరిక!
Nellore: నెల్లూరు నగరంలో స్థానిక ఎన్నికల వేళ వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. 63వ డివిజన్ నేత జుబేరుద్దీన్ మంత్రి నారాయణ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
Nellore: నెల్లూరులో టీడీపీలోకి వైసీపీ మైనారిటీ నేతల చేరిక!
నెల్లూరు: స్థానిక ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు నగర రాజకీయాల్లో సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. వైసీపీ నుంచి టీడీపీలోకి, టిడిపిలో నుంచి వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి... ఈ నేపథ్యంలో 63వ డివిజన్కు చెందిన వైసీపీ నాయకుడు మొహమ్మద్ జుబేరుద్దీన్ తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ
జుబేరుద్దీన్తో పాటు ఇతర నాయకులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. నెల్లూరులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు మైనారిటీ నాయకులు పేర్కొన్నారు. స్థానికంగా పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
టీడీపీలో చేరిన నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి నారాయణ సూచించారు. పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేస్తూ ప్రజలతో మమేకం కావాలని, డివిజన్లో పార్టీని బలోపేతం చేసి స్థానిక ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించే దిశగా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన నాయకులకు తగిన ప్రాధాన్యం ఇస్తూ అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని సూచించారు.




