Nellore: నెల్లూరులో కూటమి అభ్యర్థుల ప్రచారం.. పునీత్ హాజరు!
Nellore: నెల్లూరు 16, 17 డివిజన్ల కూటమి కార్పొరేటర్ అభ్యర్థుల తరఫున మంత్రి నారాయణ అల్లుడు పునీత్ ముమ్మర ప్రచారం నిర్వహించారు. స్థానికులు గజమాలలతో ఘన స్వాగతం పలికారు.
Nellore: నెల్లూరులో కూటమి అభ్యర్థుల ప్రచారం.. పునీత్ హాజరు!
నెల్లూరు: నెల్లూరు నగరంలో సుపరిపాలన మంత్రి నారాయణతోనే సాధ్యమని, ఆయన చేసిన అభివృద్ధిని చూపి ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నామని 16 17 డివిజన్ల కూటమి అభ్యర్థులు కాకర్ల తిరుమల నాయుడు కమ్మ కళ్యాణీలు పేర్కొన్నారు. బుధవారం నగరంలోని 16, 17 డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ ప్రచార కార్యక్రమంలో వారికి మద్దతుగా మంత్రి నారాయణ అల్లుడు పునీత్ పాల్గొన్నారు. స్థానికులు పునీత్ ను గజమాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు పెద్ద ఎత్తున మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు నగరంలో ఎటువైపు చూసినా అభివృద్ధి కనిపిస్తుంది అన్నారు.
గత ఎన్నికల్లో రాక్షస పాలన నుంచి విముక్తి పొంది కూటమి ప్రభుత్వం నేతృత్వంలో అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, పార్కులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తాగునీరు వంటి అనేక మంచి కార్యక్రమాలను మంత్రి నారాయణనెల్లూరు నగర ప్రజలకు అందించారని ఆయన చేసిన అభివృద్ధిని ప్రజలకు చూపి ఓట్లు అభ్యర్థిస్తున్నామని తెలిపారు.
మేయర్ అభ్యర్థిగా రూపు కుమార్ యాదవ్ అలాగే 16 డివిజన్ 17 డివిజన్ అభ్యర్థులు గా వున్న కాకర్ల తిరుమల నాయుడు కమ్మ కళ్యాణీలను మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షో కి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




