Nellore: అభివృద్ధిని చూసే ప్రజలు మన వైపు ఉన్నారు: షరణి పొంగూరు!

Nellore: నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు షరణి విస్తృతంగా ప్రచారం చేశారు. మేయర్, కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 23 Oct 2026 7:35 PM IST
Nellore
X

Nellore: అభివృద్ధిని చూసే ప్రజలు మన వైపు ఉన్నారు: షరణి పొంగూరు!

నెల్లూరు: నెల్లూరు నగర పాలక సంస్థ ఎన్నికల్లో కూటమి శ్రేణుల ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్ తో పాటు 14వ డివిజన్ అభ్యర్థి కువ్వరాపు బాలాజీ, 16వ డివిజన్ అభ్యర్థి కమ్మ కళ్యాణి, 19వ డివిజన్ అభ్యర్థి కర్తం ప్రతాప్ రెడ్డి, మరియు 20వ డివిజన్ అభ్యర్థి గణేసం వెంకటేశ్వర్లుల విజయమే లక్ష్యంగా మంత్రి నారాయణ కుమార్తె పొంగురు షరిణి నేతృత్వంలో కూటమి నేతలు నగరంలోని అన్ని డివిజన్లలో విస్తృతంగా ప్రచారం చేపట్టారు.

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా స్టోన్ హౌస్‌పేట, నవాబ్‌పేట, FCI కాలనీ, తడికల బజార్ బాలాజీ నగర్ వంటి ప్రాంతాల్లో హోరెత్తుతున్న ఈ ఇంటింటి ప్రచారంలో స్థానిక మహిళలు గజమాలలు, పూలవర్షం, మంగళహారతులతో కూటమి అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతున్నారు. 14వ డివిజన్లో ఎన్నికల పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం.

ప్రతి ఇంటికి వెళ్లి గత రెండేళ్ల అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ స్మార్ట్ సిటీ నెల్లూరు నిర్మాణం కోసం కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరడం నగర రాజకీయాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా షరిణి మాట్లాడుతూ TDP కార్పొరేటర్ అభ్యర్థి కువ్వరాపు బాలాజీ,కమ్మ కల్యాణి, 19వ డివిజన్ అభ్యర్థి కర్తం ప్రతాప్ రెడ్డి.

20వ డివిజన్ అభ్యర్థి గణేసం వెంకటేశ్వర్లు గారితో కలసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నామని, ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ కి, కార్పొరేటర్లకు సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని నెల్లూరు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE