Nellore: నెల్లూరు అభివృద్ధికి కూటమిని గెలిపించండి: అబ్దుల్ అజీజ్!

Nellore: నెల్లూరు 71వ డివిజన్‌లో జనసేన కార్పొరేటర్ అభ్యర్థి అలియాకు మద్దతుగా వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ప్రచారం చేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 23 Oct 2026 5:25 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు అభివృద్ధికి కూటమిని గెలిపించండి: అబ్దుల్ అజీజ్!

నెల్లూరు: నెల్లూరు నగర సమగ్రాభివృద్ధికి కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఏపీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పిలుపునిచ్చారు. 71వ డివిజన్‌లో కూటమి బలపరిచిన జనసేన కార్పొరేటర్ అభ్యర్థి అలియాకు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ....ఈసారి కార్పొరేటర్‌కు, మేయర్‌కు వేర్వేరుగా ఓటు వేయాల్సి ఉంటుందని తెలిపారు. కార్పొరేటర్ అభ్యర్థి అలియాకు గాజు గ్లాసు గుర్తుపై, మేయర్ అభ్యర్థి రూప్‌కుమార్ యాదవ్‌కు సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు.

అలియా విజయానికి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, నగరపాలక సంస్థ సమన్వయంతో పనిచేస్తే స్థానిక సమస్యలను వేగంగా పరిష్కరించవచ్చన్నారు.

మైనారిటీ పిల్లల కోసం వక్ఫ్ బోర్డు స్థలంలో రూ.20 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాలను నిర్మిస్తున్నామని అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. ప్రచారంలో జమీర్, షాహిద్ తదితరులు పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE