Nellore: నగర నూతన మేయర్‌గా రూప్ కుమార్ యాదవ్ ప్రమాణం!

Nellore: నెల్లూరు నగర పాలక సంస్థ నూతన మేయర్‌గా పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్, 72 మంది కార్పొరేటర్లతో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల సోమవారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేయించారు.

A Praveen, Nellore
Published on: 23 Nov 2026 12:56 PM IST
Nellore
X

Nellore: నగర నూతన మేయర్‌గా రూప్ కుమార్ యాదవ్ ప్రమాణం!

నెల్లూరు: నెల్లూరు నగర పాలక సంస్థ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ప్రిసైడింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నెల్లూరు నగర పాలక సంస్థ నూతన మేయర్‌గా పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నగరంలోని 72 మంది నూతన కార్పొరేటర్లతో ప్రిసైడింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ప్రమాణ స్వీకారం చేయించారు.

నూతన పాలకమండలి కొలువుదీరడంతో నెల్లూరు నగరంలో అభివృద్ధి కార్యక్రమాలకు కొత్త దిశానిర్దేశం లభించనుందని నాయకులు, కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అధికారులు, కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

A Praveen, Nellore

A Praveen, Nellore