Nellore: నెల్లూరు 12వ డివిజన్లో కూటమి అభ్యర్థి సాగర్ నామినేషన్!
Nellore: నెల్లూరు నగర పాలక సంస్థ 12వ డివిజన్ కూటమి అభ్యర్థిగా సాగర్ నవాబుపేట నుంచి భారీ ర్యాలీతో తరలివచ్చి నామినేషన్ దాఖలు చేశారు. మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.
Nellore: నెల్లూరు 12వ డివిజన్లో కూటమి అభ్యర్థి సాగర్ నామినేషన్!
నెల్లూరు: నెల్లూరు సిటీ 12వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా సాగర్ నామినేషన్ దాఖలు చేశారు. నవాబుపేట సెంటర్ నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి ఆర్వో కార్యాలయానికి చేరుకున్న ఆయన నామినేషన్ పత్రాలను సమర్పించారు.
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థులను ఆశీర్వదించి ఆదరించాలని నాయకులు ప్రజలను కోరారు. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్, మాజీ లుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, కిన్నెర మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.




