Nellore: నెల్లూరులో కొత్త లేఅవుట్‌లను తనిఖీ చేసిన నగర కమిషనర్ వై.ఓ. నందన్!

Nellore: నెల్లూరు కమిషనర్ వై.ఓ. నందన్ అల్లీపురం, ధనలక్ష్మిపురంలో నూతన లేఅవుట్‌లను తనిఖీ చేశారు. అనుమతుల మేరకే నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు.

V. Narasimhulu, Nellore
Published on: 13 Oct 2026 4:05 PM IST
Nellore
X

Nellore: నెల్లూరులో కొత్త లేఅవుట్‌లను తనిఖీ చేసిన నగర కమిషనర్ వై.ఓ. నందన్!

నెల్లూరు: నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ స్థానిక అల్లీ పురం, ధనలక్ష్మిపురం, కనపర్తిపాడు, సప్తగిరి కాలనీ ప్రాంతాలలో నూతనంగా నిర్మిస్తున్న లే అవుట్ లను టౌన్ ప్లానింగ్ విభాగం సిటీ ప్లానర్ రఘు నాధరావుతో కలిసి మంగళవారం పరిశీలించారు.

లేఅవుట్ ల నిర్మాణాలకు అవసరమైన అనుమతులు, ప్లానులు తదితర పత్రాలను కమిషనర్ తనిఖీ చేసి లే అవుట్ ల నిర్వాహకులకు వివిధ సూచనలు జారీ చేశారు. నెల్లూరు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం నిర్దేశించిన అనుమతుల మేరకే నిర్మాణాలను చేపట్టాలని, నిబంధనలను ఉల్లంఘించరాదని సూచించారు.

అనుమతించిన మేరకు మాత్రమే లేఔట్ ల నిర్మాణాలు జరిగేలా, లే అవుట్ పరిధిలో నిర్దేశించిన అన్ని వసతులు ఏర్పాటు చేసేలా పర్యవేక్షించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం టి.పి.బి.ఓ లు, వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore