Nellore: స్వామివారికి అభిషేకాలు.. ఘనంగా అన్నప్రసాద వితరణ!
Nellore: నెల్లూరు మూలపేట శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు, భక్తులకు ఘనంగా అన్నప్రసాద వితరణ.
Nellore: స్వామివారికి అభిషేకాలు.. ఘనంగా అన్నప్రసాద వితరణ!
నెల్లూరు: నెల్లూరు నగరంలోని మూలపేటలో వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
వేద మంత్రోచ్ఛారణల నడుమ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు, అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో భక్తులతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.




