Nellore: నెల్లూరులో పసుపు తుఫాన్: పరిషత్‌లోనూ వైసీపీ గల్లంతు!
Nellore: నెల్లూరు జిల్లా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభంజనం సృష్టించింది. ఎంపీ కార్యాలయంలో మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ఫలితాల సరళిని సమీక్షించారు.
Nellore: నెల్లూరులో పసుపు తుఫాన్: పరిషత్‌లోనూ వైసీపీ గల్లంతు!
నెల్లూరు: నెల్లూరు జిల్లా స్థానిక ఎంపీటీసీ జడ్పిటిసి కౌంటింగ్ కేంద్రాల వద్ద వాతావరణం అత్యంత ఉత్కంఠభరితంగా మారింది..ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో విజయఢంకా మోగించి, వైసీపీని పూర్తిగా గల్లంతు చేసిన కూటమి పార్టీ... ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లోనూ అదే విజయోత్సాహాన్ని కొనసాగిస్తోంది ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచే కూటమి అభ్యర్థులు ఏకపక్షంగా భారీ ఆధిక్యత వైపు దూసుకుపోతున్నారు.
మరోవైపు, ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్‌పై ఫలితాలను ప్రత్యక్షంగా వీక్షిస్తూ... మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, మేయర్ రూప్ కుమార్ యాదవ్ విజయ ఫలితాల సరళిని నిశితంగా సమీక్షిస్తున్నారు... కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోరుతో ఉన్న పసుపు శ్రేణులు, ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల లెక్కింపులోనూ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి.
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద టీడీపీ ముందంజలో ఉండటంతో ఎంపీ కార్యాలయంలో సంబరాల వాతావరణం నెలకొంది. ఎప్పటికప్పుడు మారుతున్న రౌండ్ల వారీ ఫలితాలను ప్రత్యేక స్క్రీన్‌పై పర్యవేక్షిస్తూ... ముఖ్య నేతలు మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, మేయర్ రూప్ కుమార్ యాదవ్ పార్టీ విజయావకాశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రత్యర్థి వైకాపాను పూర్తిగా క్లీన్ స్వీప్ చేసే దిశగా దూసుకెళ్తున్న ఈ ఫలితాలపై టీడీపీ శ్రేణులు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నాయి.




