Nellore: బుచ్చిరెడ్డిపాళెంలో P4 విధానం ద్వారా అభివృద్ధి ప్రారంభం!
Nellore: ప్రైవేటు-ప్రజల భాగస్వామ్యం (P4) విధానంలో బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీకి నిర్మించి ఇచ్చిన రెండు దుకాణాలను ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ప్రారంభించారు.
Nellore: బుచ్చిరెడ్డిపాళెంలో P4 విధానం ద్వారా అభివృద్ధి ప్రారంభం!
Nellore: ప్రజా-ప్రైవేటు-ప్రజల భాగస్వామ్యం (P4) విధానంలో భాగంగా బుచ్చిరెడ్డిపాళెం మున్సిపల్ చైర్‌పర్సన్ మోర్ల సుప్రజ, మురళి దంపతులు మున్సిపాలిటీకి నిర్మించి ఇచ్చిన రెండు దుకాణాలను కూడా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రారంభించారు. మున్సిపాలిటీకి ఆదాయం పెంచే ఉద్దేశంతో దుకాణాలను నిర్మించి ఇవ్వడాన్ని ఎమ్మెల్యే అభినందించారు.
బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలో ప్రతి వార్డులోనూ ప్రజలకు అవసరమైన రోడ్లు, కాలువలు, తాగునీరు, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, మహిళలు, చిన్నారులకు అవసరమైన సదుపాయాలను దశలవారీగా కల్పిస్తున్నామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లకు అనుగుణంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి పార్టీలు నిర్ణయించి ప్రకటించే అభ్యర్థులకు ప్రజలు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోరారు
. బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి, మున్సిపాలిటీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి అంకితం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత రెండేళ్ల మూడు నెలల్లో బుచ్చిరెడ్డిపాళెంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలు గమనించారని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసి పట్టణాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తెలిపారు.




