Nellore: దౌర్జన్యాలు చేస్తే తగిన గుణపాఠం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి!
Nellore: రాష్ట్రంలో వైసీపీ దౌర్జన్యాలు చేస్తే తగిన గుణపాఠం తప్పదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు.
Nellore: దౌర్జన్యాలు చేస్తే తగిన గుణపాఠం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి!
నెల్లూరు: గత జగన్ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం దివాళా తీసిందని, దీంతో ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చారని చెప్పారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు...
కూటమి హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం విస్తృతంగా జరుగుతోందని, రాష్ట్రంలో శాంతిభద్రతలకి విఘాతం కలిగించాలని జగన్ ప్రయత్నిస్తున్నారని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక స్థానిక ఎన్నికలు పెట్టకుండా వైసీపీ రెండేళ్లు అప్పట్లో వాయిదా వేసిందని, స్థానిక సంస్థల ఎన్నికలు అడ్డుకోవాలని కోర్టులని వైసీపీ ఆశ్రయించిందని గుర్తు చేశారు.
రాష్ట్రంలో దౌర్జన్యం చేయాలని జగన్ చూస్తున్నారని, పుంగనూరు, రాయచోటి, తిరుపతిలో నామినేషన్ తొలిరోజే వైసీపీ అరాచకాలు చేసిందన్నారు.
మిధున్ రెడ్డి వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని కొట్టుకుంటూ, తొక్కుకుంటూ పోవాలి అని అన్నాడని, పిచ్చిపిచ్చి చేష్టలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి... నెల్లూరు కార్పొరేషన్ లో టీడీపీ కూటమి మేయర్ అభ్యర్థి లక్ష ఓట్ల మెజార్టీ తో గెలవబోతున్నారని, 72కి 72 డివిజన్లలో వందశాతం కార్పొరేటర్లు గెలవబోతున్నారని,
రూరల్ లో వైసిపి దౌర్జన్యాలకి పాల్పడితే టీడీపీ కార్యకర్తలు ఎవరు భయపడవద్దని చెప్పారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.




