Nellore: కూటమి అభ్యర్థులకు భారీ మెజారిటీ ఇవ్వాలి కోటంరెడ్డి

Nellore: నెల్లూరు రూరల్ మెట్రో కళ్యాణమండపంలో ఆత్మీయ సమావేశం. కూటమి మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్, 28, 30 డివిజన్ అభ్యర్థులను గెలిపించాలని కోటంరెడ్డి పిలుపు.

V. Narasimhulu, Nellore
Published on: 28 Oct 2026 11:20 PM IST
Nellore
X

Nellore: కూటమి అభ్యర్థులకు భారీ మెజారిటీ ఇవ్వాలి కోటంరెడ్డి

నెల్లూరు: కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి తరపున పోటీ చేస్తున్న మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్ , కార్పొరేటర్ అభ్యర్థులు నన్నం శ్రీనివాసులు, నూనె రిషి యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పిలుపునిచ్చారు.

నెల్లూరు రూరల్ పరిధిలోని మెట్రో కళ్యాణమండపంలో బుధవారం ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 966 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశాము.

ప్రజల ఆలోచించి అభివృద్ధికి పట్టం కట్టండి. కూటమి మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్ ని,28,30,డివిజన్ అభ్యర్థులు నన్నం శ్రీనివాసులు మరియు నూనె రిషి యాదవ్ లను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore