Nellore: నెల్లూరును మోడల్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం: నారాయణ!
Nellore: నెల్లూరు నగరం పరమేశ్వరి నగర్‌లో నిర్మిస్తున్న అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తామన్నారు.
Nellore: నెల్లూరును మోడల్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం: నారాయణ!
నెల్లూరు: నగరంలోని పరమేశ్వరి నగర్‌లో నిర్మిస్తున్న అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణ పనులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి, నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రికి టీడీపీ నాయకులు, స్థానికులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. యువనేత నారా లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్, అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. వీఆర్‌సీ స్ఫూర్తితో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పలువురు దాతలు ముందుకొస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే ఆర్ఎస్ఆర్, డీఎస్ఆర్ హైస్కూళ్లను అద్భుతంగా తీర్చిదిద్దామని వెల్లడించారు.




