Nellore: 11, 12, 14, 18 డివిజన్లలో పొంగూరు రమాదేవి రోడ్‌షోలు!

Nellore: నెల్లూరు 11, 12, 14, 18 డివిజన్లలో పొంగూరు రమాదేవి రోడ్‌షోలు. కూటమి మేయర్ అభ్యర్థి రూప్‌కుమార్ యాదవ్, కార్పొరేటర్లను గెలిపించాలని విజ్ఞప్తి.

V. Narasimhulu, Nellore
Published on: 27 Oct 2026 8:36 PM IST
Nellore
X

Nellore: 11, 12, 14, 18 డివిజన్లలో పొంగూరు రమాదేవి రోడ్‌షోలు!

నెల్లూరు: కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారానికి గడువు మూడు రోజులే ఉండటంతో కూటమి నేతలు ప్రచార వేగాన్ని పెంచారు. అభ్యర్థుల విజయమే లక్ష్యంగా మంత్రి డాక్టర్‌ పొంగూరు నారాయణ కుటుంబం జెట్‌ స్పీడ్‌తో ముందుకు సాగుతోంది. ఇప్పటికే పలు డివిజన్లలో పలుమార్లు పర్యటించిన నేతలు ప్రచారంలో క్యాడర్‌లో ఉత్సాహం నింపుతున్నారు.

మంగళవారం మంత్రి సతీమణి పొంగూరు రమాదేవి 11,12,14,18 డివిజన్లలో రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారం నిర్వహించారు.డివిజన్లలో పర్యటించిన రమాదేవికి అభ్యర్థులు కొండా గీతిక,కిన్నెర సాగర్ కువ్వారపు బాలాజీ, గొడ్డేటి లక్ష్మి ఆధ్వర్యంలో గజమాలలతో ఘనస్వాగతం పలికారు.

రోడ్‌షోలలో కూటమి కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. స్థానికులతో మమేకమవుతూ, డివిజన్లలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ రమాదేవి ఓటర్ల మద్దతు కోరారు. మేయర్‌ అభ్యర్థి రూప్‌కుమార్‌ యాదవ్‌తో పాటు కార్పొరేటర్‌ అభ్యర్థులు కొండా గీతిక,కిన్నెర మాల్యాద్రి,బాలాజీ, లక్ష్మిలతో పాటు మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ లకు సైకిల్‌ గుర్తుపై ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore