Nellore: జనంలో ఒకరై.. పొంగూరు షరణి ప్రచార సునామీ!
Nellore: నెల్లూరులో మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు షరణి వినూత్న ప్రచార హోరు. ఆటో నడుపుతూ, కార్యకర్తలతో క్యారమ్స్ ఆడుతూ కూటమి అభ్యర్థుల విజయం కోసం విజ్ఞప్తి.
Nellore: జనంలో ఒకరై.. పొంగూరు షరణి ప్రచార సునామీ!
నెల్లూరు: రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజల ఇంటింటికీ చేర్చుతూ కూటమి అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా ఆయన కుమార్తె షరణి మొదట్నుంచీ చేపడుతున్న విశేష ప్రచారాలు జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ ఏకంగా సునామీని తలపిస్తున్నాయి.
ప్రచార ప్రారంభం నుంచి ఆమె చూపిస్తున్న అపారమైన సమర్థత, ఓటర్లతో మమేకమవుతున్న తీరుతో ప్రజల మనస్సులను పూర్తిగా దోచుకుంటున్నారు..స్వయంగా ఆటో నడుపుతూ, రిక్షా తొక్కుతూ, స్వహస్తాలతో కూరగాయలు విక్రయిస్తూ సామాన్య ప్రజలలో ఒకరిగా మారిపోవడమే కాకుండా, డివిజన్ల పర్యటనలో కార్యకర్తలతో కలిసి క్యారమ్స్ ఆడుతూ అందరినీ ఆశ్చర్యపరిచి వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపారు.
షరణి ఈ ప్రచార మార్కు, ఆమె ప్రజాదరణ మరియు కూటమి ఐక్యతతో అడుగడుగునా నియోజకవర్గ ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పడుతూ తమ హృదయాలలో చెరగని ముద్ర వేసుకుంటున్నారు.ఈ విశేష ప్రచారంలో భాగంగా షరణి కూటమి మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్ తో పాటు,
66 డివిజన్ అభ్యర్థి కప్పిర రేవతి, 67 డివియన్ అభ్యర్థి నిమ్మల ప్రసన్న కుమారి , 68 డివిజన్ అభ్యర్థి కట్టమూరి శైలజ మరియు 69 డివిజన్ అభ్యర్థి షేక్ షాహినా తిరుగులేని భారీ మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. తండ్రి డాక్టర్ పొంగూరు నారాయణ చేపట్టిన అభివృద్ధికి తన ఆత్మీయ అనుబంధాన్ని తోడు చేసి అనేక విధాలుగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్న ఆమె కష్టానికి ఓటర్ల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది.
మొదటి నుంచీ ప్రజల హృదయాలను గెలుచుకుంటూ సాగుతున్న షరణి గారి పర్యటనలు కూటమి క్లీన్ స్వీప్ దిశగా సాగుతూ, తిరుగులేని విజయాన్ని ఖాయం చేస్తూ జిల్లా రాజకీయాల్లో ఒక కొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి.




