Nellore: బేల్దార్ అవతారమెత్తిన మంత్రి నారాయణ కుమార్తె షరణి!
Nellore: నెల్లూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు షరణి వినూత్న శైలి. ఇటుకలు మోసి, శ్రామికులకు అండగా ఉంటూ కూటమి తరఫున ప్రచారం.
Nellore: బేల్దార్ అవతారమెత్తిన మంత్రి నారాయణ కుమార్తె షరణి!
నెల్లూరు: నెల్లూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు షరణి తన వినూత్న శైలితో సరికొత్త రాజకీయ అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. హోదా, ఆడంబరాలను పూర్తిగా పక్కనపెట్టి సామాన్యులలో ఒకరిగా మమేకమవుతున్న ఆమె, డోర్-టు-డోర్ క్యాంపెయినింగ్తో ఓటర్ల మనసు గెలుచుకుంటున్నారు.
ప్రచారంలో భాగంగా స్వయంగా ఇటుకలు, కంకర మోసి బేల్దార్ అవతారమెత్తి శ్రామిక వర్గం పట్ల అచంచలమైన గౌరవాన్ని చాటుకోవడమే కాకుండా.. మార్గమధ్యంలో స్వయంగా చెరకు రసం తీసి, పైనాపిల్ కోసి పార్టీ శ్రేణులకు తినిపిస్తూ చూపిన ఆత్మీయత స్థానికులను, కార్యకర్తలను తీవ్రంగా ఆకట్టుకుంది.
ఈ వినూత్న ప్రజాదరణతో నగరంలో కూటమి శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నిండింది..బుధవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా 90 శాతం పూర్తయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, రోడ్ల నిర్మాణం, VRC-DSR-RSR పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి వసతులు, ఆస్ట్రోనమీ లాబ్స్, హైడ్రోఫోనిక్స్ టెక్నాలజీ, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంతో పాటు డిసెంబర్ 31 నాటికి సంగం బ్యారేజ్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించే బృహత్తర ప్రణాళికలను షరణి ప్రజలకు వివరించారు.
మంత్రి నారాయణ నగరానికి అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి బాటకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, దీంతో కూటమి విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్, 54వ డివిజన్ అభ్యర్థి అన్నంగి సమత, 55వ డివిజన్ అభ్యర్థి గండవరం విశాలాక్షి, 70వ డివిజన్ అభ్యర్థి రాచగిరి చంద్రతో పాటు కూటమి డివిజన్ అభ్యర్థులందరినీ సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు..




