Nellore: నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ముమ్మర ప్రచారం!
Nellore: నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా మంత్రి పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి విస్తృత ప్రచారం. రోడ్‌షోలకు విశేష స్పందన.
Nellore: నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ముమ్మర ప్రచారం!
నెల్లూరు: నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులతో పాటు జనసేన, బీజేపీ అభ్యర్థుల గెలుపునకు ప్రాధాన్యతనిస్తూ ప్రచార కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. కూటమి ధర్మంలో భాగంగా మిత్రపక్షాల అభ్యర్థుల తరఫున స్వయంగా ప్రచార బాధ్యతలు చేపట్టి, ఆయా డివిజన్లలో రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా నగరంలోని 15వ డివిజన్‌లో మంత్రి నారాయణ రోడ్‌షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి కూడా పాల్గొని కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. జనసేన అభ్యర్థి కెజియా కుమారికి గాజు గ్లాసు గుర్తుపై, మేయర్ అభ్యర్థి రూప్‌కుమార్ యాదవ్‌కు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.
రోడ్‌షోకు ఆయా ప్రాంతాల్లో మహిళలు హారతులు పట్టి స్వాగతం పలకగా, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. దీంతో ఎన్నికల ప్రచార ప్రాంతాల్లో సందడి నెలకొంది. మిత్రపక్షాల అభ్యర్థుల గెలుపు కోసం మంత్రి నారాయణ స్వయంగా రంగంలోకి దిగడం ద్వారా కూటమి పార్టీల మధ్య సమన్వయాన్ని చాటుతున్నారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ నెల్లూరు నగర అభివృద్ధికి కృషి చేస్తున్నామని మంత్రి వివరించారు. నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మేయర్ స్థానంతో పాటు అన్ని డివిజన్లలోనూ కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
మిత్రపక్షాల అభ్యర్థుల విజయాన్ని తన ప్రచార బాధ్యతగా తీసుకుని మంత్రి నారాయణ ముందుకు సాగడం నెల్లూరు నగర ఎన్నికల ప్రచారంలో ప్రాధాన్యం సంతరించుకుంది.




