Nellore: నందవరంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ప్రత్యేక శిక్షణ!

Nellore: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నందవరం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ఎల్‌నినో దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించారు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 16 Nov 2026 6:01 PM IST
Nellore
X

Nellore: నందవరంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ప్రత్యేక శిక్షణ!

నెల్లూరు: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం,నందవరం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో జొన్న, సజ్జ, రాగి, శనగ, పెసర, మినుము, వేరుశనగ, నువ్వులు వంటి తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు.

భూసార పరీక్షలు, జీవ ఎరువుల వినియోగం, విత్తన శుద్ధి, నీటి సంరక్షణ, చీడపీడల నివారణపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎన్. కవిత, వ్యవసాయ అధికారులు బి. శ్రీనివాస చక్రవర్తి, పి. శ్రీధర్ రెడ్డి, శాస్త్రవేత్త డా. కె. కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)