Manubolu: విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా షాక్‌తో కూలీ మృతి

Manubolu: మనుబోలు మండలం వీరంపల్లిలో విద్యుత్ లైన్ మరమ్మతులు చేస్తుండగా షాక్ తగిలి శ్రీనివాసులు మృతి చెందాడు. గ్రామస్థులు, కుటుంబ సభ్యుల ఆందోళన.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 7 Oct 2026 7:58 PM IST
Manubolu
X

Manubolu: విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా షాక్‌తో కూలీ మృతి

మనుబోలు: మనుబోలు మండలం వీరంపల్లి వద్ద విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ లైన్ మరమ్మత్తు చేస్తుండగా శ్రీనివాసులు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఇద్దరు పిల్లలు తండ్రిని కోల్పోయి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

నెల్లూరు జిల్లా మనుబోలు మండలం వీరంపల్లి సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. వీరంపల్లికి చెందిన శ్రీనివాసులు, వయస్సు 45 సంవత్సరాలు, విద్యుత్ లైన్ పైకి ఎక్కి వైర్లు బిగిస్తున్న క్రమంలో అకస్మాత్తుగా విద్యుత్ షాక్ కు గురయ్యాడు.షాక్ కొట్టడంతో అదుపు తప్పి పై నుంచి కిందకు పడిపోయాడు.

తలకు, శరీరానికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు., లైన్ మరమ్మత్తు సమయంలో కరెంట్ సప్లై ఆఫ్ చేయలేదా? సేఫ్టీ పరికరాలు లేకుండా ఎందుకు ఎక్కాడు? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే ఈ మృతికి కారణమా అనే కోణంలో కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు.

మృతుడు శ్రీనివాసులు సాధారణ కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు తండ్రి లేని ఆ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. తండ్రి మృతితో ఆ ఇంట్లో రోదనలు మిన్నంటాయి. గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది.సమాచారం అందుకున్న వెంటనే మనుబోలు పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, విద్యుత్ శాఖ తరఫున నష్టపరిహారం అందించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్