Nellore: రాపూరులో భారీ పిడుగుపాటు.. తప్పిన పెను ప్రమాదం!
Nellore: నెల్లూరు జిల్లా రాపూరు కాపు వీధిలో భవనంపై పిడుగు పడటంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.
Nellore: రాపూరులో భారీ పిడుగుపాటు.. తప్పిన పెను ప్రమాదం!
Nellore: నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలోని కాపు వీధిలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పిడుగు పడటంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. స్థానికుడు బత్తిన పెంచలరెడ్డికి చెందిన మూడంతస్తుల భవనంపై పిడుగు పడటంతో భవనం మూడో అంతస్తు భాగం పాక్షికంగా దెబ్బతింది.
పిడుగుపాటు ధాటికి భవనం పైభాగంతో పాటు విద్యుత్ ఉపకరణాలు దెబ్బతిన్నాయి. సుమారు రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు భవన యజమాని తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. పిడుగు పడిన సమయంలో భారీ శబ్దం రావడంతో కాపు వీధి ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.




