Nellore: ఎస్.వి.పాలెం ఎస్సీ కాలనీలో మహిళలకు న్యాయ అవగాహన

Nellore: నెల్లూరు జిల్లా ఎస్.వి.పాలెంలో మహిళలకు చట్టాలపై అవగాహన సదస్సు. మహిళలకు కాంగ్రెస్ లీగల్ సెల్ ఎల్లవేళలా అండగా ఉంటుందని న్యాయవాది వి.సుధీర్ హామీ.

A Praveen, Nellore
Published on: 29 Sept 2026 6:15 PM IST
Nellore
X

Nellore: ఎస్.వి.పాలెం ఎస్సీ కాలనీలో మహిళలకు న్యాయ అవగాహన

నెల్లూరు: నెల్లూరు బోగోలు మండలం, ఎస్.వి.పాలెం మహిళలు తమకు రాజ్యాంగం, చట్టాలు కల్పించిన హక్కులపై అవగాహన కలిగి ఉండాలని కాంగ్రెస్ లీగల్ సెల్ నాయకుడు, న్యాయవాది వి. సుధీర్ అన్నారు.

బోగోలు మండలం ఎస్.వి.పాలెం ఎస్సీ కాలనీలో మహిళలను ఒకచోట సమావేశపరిచి, వారికి చట్టపరమైన హక్కులు, మహిళల రక్షణకు ఉన్న చట్టాలు, సమస్యలు ఎదురైనప్పుడు తీసుకోవాల్సిన న్యాయపరమైన చర్యలపై న్యాయవాది వి. సుధీర్ అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు తమపై జరిగే అన్యాయాన్ని మౌనంగా భరించాల్సిన అవసరం లేదని, తమ హక్కులను తెలుసుకుని అవసరమైనప్పుడు చట్టపరమైన మార్గంలో న్యాయం కోసం పోరాడాలని సూచించారు. కుటుంబ సమస్యలు, గృహహింస, మహిళలపై వేధింపులు, ఆస్తి హక్కులు, వివాహ సంబంధిత సమస్యలు తదితర అంశాల్లో చట్టపరమైన సహాయం అందుబాటులో ఉందని తెలిపారు.

మహిళలకు ఏ విధమైన న్యాయ సమస్య ఎదురైనా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అందుబాటులో ఉంటుందని, సమస్యను అర్థం చేసుకుని సాధ్యమైన మేరకు న్యాయపరమైన అవగాహన, సలహా మరియు మార్గదర్శకత్వం అందిస్తామని వి. సుధీర్ తెలిపారు.

ప్రజలకు చట్టంపై అవగాహన కల్పించడం ద్వారా తమ హక్కులను తాము రక్షించుకునే విధంగా చైతన్యపరచడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.

“చట్టం గురించి తెలుసుకోవడం ప్రతి పౌరుడి హక్కు – ఆ హక్కును రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత” అని వి. సుధీర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు పాల్గొని తమకు ఉన్న వివిధ సమస్యలను న్యాయవాది వి. సుధీర్ దృష్టికి తీసుకురాగా, వాటిపై ఆయన న్యాయపరమైన అవగాహన కల్పించారు.

A Praveen, Nellore

A Praveen, Nellore