Nellore: సీఈసీ ఎంపిక కమిటీపై వామపక్షాల పోరుబాట.. నెల్లూరులో భేటీ

Nellore: కేంద్ర ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీలో సీజేఐని చేర్చాలని, ఓటర్ల జాబితా అక్రమాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో వామపక్షాలు నిరసనకు పిలుపునిచ్చాయి.

A Praveen, Nellore
Published on: 26 Sept 2026 3:06 PM IST
Nellore
X

Nellore: సీఈసీ ఎంపిక కమిటీపై వామపక్షాల పోరుబాట.. నెల్లూరులో భేటీ

Nellore: కేంద్ర ఎన్నికల కమిటీ నియామకాన్ని ప్రధానమంత్రి ప్రతిపక్ష నేత భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన ఎంపిక కమిటీ విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు దేశవ్యాప్తంగా నిరసనలు పిలుపునిచ్చాయి ఈ విషయంపై నెల్లూరు జిల్లాలో సిపిఐ కార్యాలయంలో సిపిఐ జిల్లా కార్యదర్శి అరిగెల సాయి అధ్యక్షతన శనివారం వామపక్ష పార్టీలు సమావేశమైనాయి.

ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాదాల వెంకటేశ్వర్లు మోహన్ రావు సిపిఐ ఎంఎల్ నాయకులు రాంబాబు ఎస్యుసిఐ నాయకులు రమేష్ లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 26 నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని అందుకు సంబంధించి ఈనెల 28 భగత్ సింగ్ జయంతి, అక్టోబర్ రెండో తేదీ మహాత్మా గాంధీ జయంతి లను పురస్కరించుకొని కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

ప్రజాస్వామ్యవాదులు ప్రతిపక్ష పార్టీలు పౌర సమాజ సంస్థలు తో కలిసి పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుపై తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు ముగ్గురిలో ఇద్దరు కమిషన్ల మధ్య ఏకాభిప్రాయం లేకుండా సర్ నిర్ణయం జరిగినట్లు వచ్చిన నివేదికలు నాయకులు తీవ్రంగా పరిగణించారు ఓటర్ల నమోదులో తొలగించి తొలగింపులు తిరిగి చేర్చడం సర్ నిర్వహణ కు సంబంధించిన నిర్ణయాలను ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభ్యర్థులు చెప్పినట్టు వస్తున్న వార్త నివేదికలను పేర్కొని ప్రధానంగా ఓటర్ల డేటా బేస్ కేంద్రీకృతం కావడం రాష్ట్ర నియోజకవర్గాల స్థాయిలో అధికారులు డేటాపై పరిమితులు ఉండటం వంటివి ఆందోళన కలిగిస్తున్నట్లు తెలిపారు.

తాజా పరిణామాలతో ఎన్నికల సంఘం పారదర్శకత స్వతంత్రత ప్రజాస్వామ్య పనితీరుల కు ముప్పు ఏర్పడిందని ఓటు హక్కు పరిరక్షించాల్సిన అవసరం ఏర్పడిందని వారు వెల్లడించారు కనుక తక్షణం సీఈసీ పదవికి జ్ఞానేశ్వర్ కుమారుని తొలగించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని ఓటర్ల జాబితాలో సవరణ పేరుతో సర్ పేరుతో తొలగించిన వారందరికీ తిరిగి ఓటు హక్కు కల్పించాలని వామపక్ష పార్టీల డిమాండ్ చేస్తున్నాయని వారు తెలిపారు దీనిపైన జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడం జరుగుతుందని వారు స్పష్టం చేశారు.

A Praveen, Nellore

A Praveen, Nellore