Nellore: మాదాసు గంగాధరం కుటుంబానికి రఘు రామిరెడ్డి దంపతుల కృతజ్ఞతలు!
Nellore: కలువాయి బిట్–1 ఎంపీటీసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన చల్లా రఘు రామిరెడ్డి దంపతులు మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం సతీమణి నలినమ్మను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
Nellore: మాదాసు గంగాధరం కుటుంబానికి రఘు రామిరెడ్డి దంపతుల కృతజ్ఞతలు!
నెల్లూరు: ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో కలువాయి బిట్–1 నుంచి ఘన విజయం సాధించిన కలువాయి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కాబోయే మండల పరిషత్ అధ్యక్షులు చల్లా రఘు రామిరెడ్డి తన భార్య ఇందిరతో కలిసి మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం సతీమణి మాదాసు నలినమ్మను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా పూల కుండీని అందజేసి, ఎన్నికల్లో తన విజయానికి మీరు అందించిన సహకారం, చేసిన కృషికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నికల సమయంలో వారు అందించిన మద్దతు, ప్రోత్సాహం తన విజయానికి ఎంతో దోహదపడిందని రఘు రామిరెడ్డి పేర్కొన్నారు.
రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, అయితే కష్టకాలంలో అండగా నిలిచిన వారిని, విజయానికి తోడ్పడిన వారిని ఎప్పటికీ మరచిపోకూడదనే ఉద్దేశంతోనే తన భార్యతో కలిసి వచ్చి ధన్యవాదాలు తెలిపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాదాసు నలినమ్మ మాట్లాడుతూ మీరు భవిష్యత్తులో ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.




