Kaluvoya: కలువాయిలో రెండో రోజు 24 ఎంపీటీసీ నామినేషన్లు!
Kaluvoya: నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో రెండో రోజు ఎంపీటీసీ స్థానాలకు 24 నామినేషన్లు దాఖలయ్యాయి. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఎస్ఐ కోటయ్య తెలిపారు.
Kaluvoya: కలువాయిలో రెండో రోజు 24 ఎంపీటీసీ నామినేషన్లు!
కలువాయి: నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో ఎంపీటీసీ ఎన్నికల కు సంబందించి నామినేషన్ పర్వం రెండవ రోజుకు చేరింది.టీడీపీ తరపున పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ వేశారు. మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలకు 24 మంది నామినేషన్లు వేశారు. తెలుగురాయపురం, కుల్లూరు, మాదన్నగారి పల్లి సెగ్మెంట్ నుంచి ఒక నామినేషన్లు వేయలేదు.
ఈ స్థానాలకు గురువారం నామినేషన్ లు దాఖలు చేయనున్నారనీ కూటమి పార్టీ నాయకులు పేర్కొన్నారు.తోపుగుంట, చీపినాపి, కనుపూరుపల్లి సెగ్మెంట్ లకు టీడీపీ,బీజేపీ అభ్యర్థులు నామినేషన్ వేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేశారు.
నామినేషన్ కేంద్రాన్ని కలువాయి ఎస్ ఐ కోటయ్య పరిశీలించారు. ఈ సందర్బంగా .ఈ ఎన్నికల నిబంధలను పాటించాలని ఎస్ ఐ తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ 144 సెక్షన్ ను ఏర్పాటు చేశారు . నామినేషన్ కేంద్రాల పోలీస్ బలగలను కూడా ఏర్పాటు చేశారు.100 మీటర్లు దూరం వరకు ఎవరిని ఉంచకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.




