Sangam: సంగం చెక్‌పోస్టు వద్ద రోడ్డు ప్రమాదం

Sangam: సంగం చెక్‌పోస్టు వద్ద బైక్ ప్రమాదంలో తేజ పత్రిక ఎడిటర్ బొచ్చు నాగేశ్వరరావుకు తీవ్ర గాయాలు. కాలు విరగడంతో నెల్లూరు ఆసుపత్రికి తరలింపు. కోలుకోవాలని కోరిన మీడియా.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 21 Oct 2026 7:51 PM IST
Sangam
X

Sangam: సంగం చెక్‌పోస్టు వద్ద రోడ్డు ప్రమాదం

సంగం: నెల్లూరు జిల్లా సంగం చెక్‌పోస్టు సెంటర్ సమీపంలోని నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై బైక్ అదుపుతప్పి జరిగిన ప్రమాదంలో తేజ పత్రిక ఎడిటర్, జర్నలిస్ట్ బొచ్చు నాగేశ్వరరావు గాయపడ్డారు.

ఈ ప్రమాదంలో ఆయన కాలు విరిగినట్లు తెలిపారు.ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.

అంబులెన్స్‌లో నాగేశ్వరరావును మెరుగైన వైద్యం కోసం నెల్లూరులోని ఆసుపత్రికి తరలించారు.జర్నలిస్ట్ బొచ్చు నాగేశ్వరరావుకు ప్రమాదం జరిగిందన్న విషయం తెలుసుకున్న తోటి మీడియా మిత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి విధుల్లోకి రావాలని జర్నలిస్టు మిత్రులు ఆకాంక్షిస్తున్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)