Nellore: డికే కాలేజీలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పరిశీలించిన జేసీ

Nellore: నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, కమిషనర్ సూరజ్ ధనుంజయ్. అధికారులకు కీలక సూచనలు.

V. Narasimhulu, Nellore
Published on: 2 Nov 2026 10:14 PM IST
Nellore
X

Nellore: డికే కాలేజీలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పరిశీలించిన జేసీ

నెల్లూరు: నెల్లూరు నగరపాలక సంస్థ రెండవ సాధారణ ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో మంగళవారం జరగనున్న కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్లను రిటర్నింగ్ ఆఫీసర్ / జాయింట్ కలెక్టర్ ఎమ్. వెంకటేశ్వర్లు, అడిషనల్ ఎలక్షన్ అథారిటీ / కమిషనర్ వై.ఓ నందన్ లు సోమవారం స్థానిక డీకే మహిళా కళాశాల ప్రాంగణంలో పరిశీలించారు.

కౌంటింగ్ ప్రక్రియలో అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ అధికారులు, సిబ్బంది ప్రణాళికాబద్ధంగా విధులను నిర్వహించాలని వారు ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ రహంతు జానీ, టౌన్ ప్లానింగ్ విభాగం సిటీ ప్లానర్ రఘునాథరావు, ఎన్నికల విభాగం అధికారులు,, సిబ్బంది పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore