Nellore: లక్ష్మీనగర్‌లో జనసేన ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ ప్రచారం

Nellore: నెల్లూరులో జనసేన నాయకులు కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ ఫలాలను ఇంటింటికీ వివరిస్తూ విస్తృత ప్రచారం నిర్వహించారు.

A Praveen, Nellore
Published on: 9 Oct 2026 5:02 PM IST
Nellore
X

Nellore: లక్ష్మీనగర్‌లో జనసేన ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ ప్రచారం

నెల్లూరు: కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ జనసేన నాయకులు కిషోర్ గునుకుల, వీర మహిళ విజయలక్ష్మి గునుకుల ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా 21వ డివిజన్ (పాత 16వ డివిజన్) పరిధిలో విస్తృత ప్రజా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు లక్ష్మీనగర్ ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలో ప్రతి గడపను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు.

“సమస్యలేని ప్రభుత్వం… బలమైన మౌలిక వసతులు… ప్రజలకు అందుబాటులో పాలన” అనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి నెల్లూరు నగర అభివృద్ధికి మరింత బలమైన పునాది వేయాలని వారు ప్రజలను కోరారు.

ఈ సందర్భంగా పలువురు కుటుంబాలు స్వచ్ఛందంగా కూటమికి మద్దతు ప్రకటించారు. “రాష్ట్రాన్ని క్లిష్ట పరిస్థితుల నుంచి బయటకు తీసుకువచ్చి అభివృద్ధి దిశగా నడిపిస్తున్న కూటమి ప్రభుత్వానికే మా మద్దతు” అని వారు స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజన్, దూరదృష్టితో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు.

అలాగే శ్రీ పొంగూరు నారాయణ గారి కార్యదక్షతతో నెల్లూరు నగరంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. అమరావతిని రాష్ట్ర రాజధానిగా జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందేలా తీర్చిదిద్దే కూటమి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా, నారాయణ గారి నాయకత్వంలో నెల్లూరు నగరాన్ని కూడా మరింత సుందరంగా, ఆధునికంగా తీర్చిదిద్దేందుకు కృషి జరుగుతోందని పేర్కొన్నారు.

నెల్లూరు నగర భవిష్యత్తు కోసం అభివృద్ధికి ఓటు – కూటమికి అండ అంటూ ప్రజలను వారు కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కిషోర్ గునుకుల, వీర మహిళ విజయలక్ష్మి గునుకుల, ప్రవల్లిక, శ్రీలక్ష్మి, కృష్ణవేణి, సుప్రియ, కృష్ణమోహన్ రెడ్డి, నాగేంద్ర బాలు, ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

A Praveen, Nellore

A Praveen, Nellore